Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 4, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
2027 జులై 8 నుంచి జగన్ పాదయాత్ర.. ముహూర్తం ఖరారు?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొకసారి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
2027 జులై 8న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు జాతీయ వార్తా సంస్థ 'IANS' వెల్లడించింది.
పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ తేదీ ఫిక్స్ అయినట్లు పేర్కొంది.గతంలో 2027లో పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించినప్పటికీ, కచ్చితమైన తేదీ బయటకు రావడం ఇదే తొలిసారి.
గతంలో 2017 నవంబర్ నుండి 2019 జనవరి వరకు ఆయన చేపట్టిన 'ప్రజాసంకల్ప యాత్ర' వైఎస్సార్సీపీకి అపారమైన ప్రజాదరణ తెచ్చిపెట్టి, ఎన్నికల్లో ఘన విజయానికి మార్గం సుగమం చేసింది.
మళ్లీ అదే వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు.


